కఠిన నిర్ణయం తీసుకుంటున్నా.. అన్నకు తమ్ముడు మెసేజ్.. చేరుకునేలోపే అంతా అయిపోయింది..!
హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరిగేషన్ ప్రాజెక్టులో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకట్ రావు(27) గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా నిరుత్సాంగా ఉంటున్న వెంకట్ తానో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నానంటూ తన అన్నకు వాట్సప్ మెసేజ్ చేశాడు. వెంటనే అనుమానం వచ్చిన వెంకట్ అన్న దీపక్.. పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకునేలోపే అప్పటికే హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, వెంకట్ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.