ప్రపంచంపై కరోనా పంజా.. పెరుగుతున్న మరణాలు

ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. రోజూ అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా 4వ స్థానంలో ఉంది. అలాగే ఎక్కువ మరణాలు నమోదవుతున్న దేశాల్లో కూడా భారత్...

ప్రపంచంపై కరోనా పంజా.. పెరుగుతున్న మరణాలు

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా సోమవారం 101882 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 63,61,132కి చేరాయి. అలాగే నిన్న 3009 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,77,147కి చేరింది. అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. అలాగే ప్రస్తుతం 3084002 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 53402 పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో కరోనా జోరు కాస్త తగ్గింది. అమెరికాలో ఓ ఐదు రోజుల నుంచి కొత్త కేసులు, మరణాల నమోదు తగ్గుతోంది. తాజాగా 21566 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 18,58,736కి చేరాయి. అలాగే 726 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 106921కి చేరింది. అలాగే ప్రస్తుతం అమెరికాలో 16947 మంది కరోనా పేషెంట్లు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో మూడ్రోజులుగా కొత్త కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుతూ, పెరుగుతూ ఉంది.

అలాగే భారత్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. రోజూ అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా 4వ స్థానంలో ఉంది. తాజాగా 8392 కరోనా కేసులు నమోదవ్వగా.. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 190535కి చేరింది. అలాగే నిన్న 230 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 5394కి చేరింది.

ఇది కూడా చదవండి:

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..