AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బులిటెన్: ప్రపంచ వ్యాప్తంగా 2.51కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,51,69,549కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 8,46,778 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 68,13,466 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,75,09,305 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి..

కరోనా బులిటెన్: ప్రపంచ వ్యాప్తంగా 2.51కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 8:26 PM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,51,69,549కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 8,46,778 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 68,13,466 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,75,09,305 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 61,39,078కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,86,855 మంది మృతి చెందారు. కాగా 25,43,424 యాక్టీవ్ కేసులు ఉండగా, 34,08,799 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్ ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు పెరుగుతూ, త‌గ్గుతూ ఉన్నాయి.

భార‌త‌ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 948 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 35,42,733కి చేరుకుంది. ఇందులో 7,65,302 యాక్టివ్ కేసులు ఉండగా.. 63,498 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 27,13,933 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Follow Us
10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ..
10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ..
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్