90 లక్షలకు చేరువలో కేసులు.. టెర్రర్ పుట్టిస్తోన్న కరోనా..
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా శనివారం 154306 కొత్త కేసులు రావడంతో..
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా శనివారం 154306 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 8905939కి చేరాయి. అలాగే నిన్న 4412 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 466250కి చేరింది. ఇక ప్రస్తుతం 3711526 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4728163గా ఉంది.
ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం 32627 కొత్త కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2329817కి చేరాయి. అలాగే నిన్న 572 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 121979కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా భారత్‌లో 154136 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 410461కి చేరుకున్నాయి. అలాగే నిన్న 306 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 13254కి చేరింది. ఇందులో యాక్టీవ్ కేసుల సంఖ్య 227755గా ఉంది. ప్రస్తుతం వ్యాధి నుంచి రికవరీ రేటు 52.5 శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం.
Read More:
బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..
విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు: హైకోర్టు