AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్‌.. లక్ష పాజిటివ్ కేసులు దాటిన దేశాలివే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణకు బ్రేక్ పడటం లేదు. చాలా దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి ఆగడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్‌.. లక్ష పాజిటివ్ కేసులు దాటిన దేశాలివే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 11:16 AM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణకు బ్రేక్ పడటం లేదు. చాలా దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మొత్తం 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,557,837కు చేరింది. వీరిలో 177,674 మంది మృత్యువాతపడగా.. 695,262 మంది కోలుకున్నారు. ఇక దేశాల వారీగా అగ్రరాజ్యం అమెరికాలో 8,19,606పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 82,973 మంది కోలుకోగా.. 45,368 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, లండన్‌ దేశాలు ఉన్నాయి. అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో టర్కీ, ఇరాన్‌, చైనా దేశాలు ఉండగా.. తాజాగా రష్యా కూడా చేరింది. ఇక వైరస్‌ పుట్టిన చైనాలో మొన్నటివరకు తగ్గినట్లే కనిపించిన కరోనా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రస్తుతం 82,810కేసులు ఉన్నాయి. ఇక భారతదేశంలో 19,984పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: ఆయన ఆరోగ్యం బావుండాలని ఆశిస్తున్నా: ట్రంప్

Follow Us