AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణాలో 56 కొత్త కేసులు: సూర్యాపేట డిఎంహెచ్ఓ డాక్టర్‌పై వేటు..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 56 కరోనా కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణాలో 56 కొత్త కేసులు: సూర్యాపేట డిఎంహెచ్ఓ డాక్టర్‌పై వేటు..
Jyothi Gadda
|

Updated on: Apr 22, 2020 | 10:55 AM

Share
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 56 కరోనా కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 928కి చేరాయి.. కొత్త‌గా నమోదైన కేసుల‌లో 26 పాజిటివ్ కేసుల‌తో సూర్యాపేట జిల్లా ముందు వ‌రుస‌లో నిలిచింది.. గ్రేట‌ర్ లో 19కేసులు నమోదు కాగా, నిజ‌మాబాద్ లో 3, గ‌ద్వాల్ . అదిలాబాద్ ల‌లో రెండే సి కేసులు న‌మోద‌య్యాయి.. ఇక ఖ‌మ్మం,మేడ్చ‌ల్,రంగారెడ్డి, వ‌రంగ‌ల్ జిల్లాలో ఒక్కో కేసు బ‌య‌ట‌ప‌డ్డాయి..కాగా . మంగ‌ళ‌వారం రోజునే 8మంది డిశ్చార్జి అవ్వడంతో కోలుకున్నవారి సంఖ్య 194కి చేరింది. అలాగే, ఈ వైరస్‌ బారిన ప‌డి మృతి చెందినవారి సంఖ్య 23కి చేరింది.
ఇదిలా ఉంటే, సూర్యాపేట జిల్లా డి ఎం హెచ్ ఓ డాక్టర్ నిరంజన్ పై ప్ర‌భుత్వం వేటు వేసింది..సూర్యాపేట జిల్లాలో ఒక్క రోజులో 25 కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది.. దీనిలో భాగంగా డాక్ట‌ర్ నిరంజ‌న్ ను తొల‌గించి నూతన డిఎంహెచ్ఓ గా డాక్టర్ బి. సాంబశివరావు నియ‌మించింది..గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు నిర్వహిస్తూ కరోనా వైరస్ వ్యాధి రహిత జిల్లాగా తీర్చి దిద్దిన ట్రాక్ రికార్డ్ డాక్టర్ డి.సాంబశివరావు కు ఉండ‌టంతో అయ‌న‌కు ఈ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Follow Us