ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న కరోనా ఉధృతి
ప్రపంచ దేశాల్లో కరోనావైరస్ ఇంకా విలయాన్ని సృష్టిస్తూనే ఉంది. తాజాగా 4,0.37.079 కేసులు నమోదు కాగా.. 276,830 మంది కరోనా రోగులు మృతి చెందారు. 1,401,026 మంది కోలుకున్నారు. అమెరికాలో అత్యధికంగా..1,322,215 కేసులు నమోదయ్యాయి. 78,622 మరణాలు సంభవించాయి. యుఎస్ తరువాత స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, బ్రెజిల్ తదితర దేశాలు వరుసగా కరోనా బారిన పడ్డాయి. అయితే స్పెయిన్, ఇటలీ దేశాల్లో మరణాల రేటు తగ్గడంతో.. మళ్ళీ ఈ దేశాల్లో క్రమంగా సాధారణ జన […]

ప్రపంచ దేశాల్లో కరోనావైరస్ ఇంకా విలయాన్ని సృష్టిస్తూనే ఉంది. తాజాగా 4,0.37.079 కేసులు నమోదు కాగా.. 276,830 మంది కరోనా రోగులు మృతి చెందారు. 1,401,026 మంది కోలుకున్నారు. అమెరికాలో అత్యధికంగా..1,322,215 కేసులు నమోదయ్యాయి. 78,622 మరణాలు సంభవించాయి. యుఎస్ తరువాత స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, బ్రెజిల్ తదితర దేశాలు వరుసగా కరోనా బారిన పడ్డాయి. అయితే స్పెయిన్, ఇటలీ దేశాల్లో మరణాల రేటు తగ్గడంతో.. మళ్ళీ ఈ దేశాల్లో క్రమంగా సాధారణ జన జీవనం కనిపిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో తిరిగి షాపింగ్ మాల్స్, క్లబ్బులు, కళకళలాడుతున్నాయి. అమెరికాలో లాక్ డౌన్ వ్యతిరేకులతో కాలిఫోర్నియా, ఫ్లోరిడా బీచ్ లు నిండిపోతున్నాయి, అటు స్పెయిన్ లో 26,478, ఇటలీలో 30,201 మరణాలు సంభవించినట్టు వార్తలందాయి.