గల్ఫ్ నుంచి కేరళ చేరుకున్న భారతీయుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్

గల్ఫ్ దేశాలైన అబుదాబి, దుబాయ్ ల నుంచి శనివారం కేరళ చేరుకున్న363 మంది భారతీయుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వీరిలో ఒకరిని కోజికోడ్ లో. మరొకరిని కోచ్చిలోని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు 505 నమోదైనట్టు రాష్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 17 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 484 మంది కోలుకున్నారని, నలుగురు మరణించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. కాగా..  తమ రాష్ట్రంలో కరోనాను సమర్థంగా […]

గల్ఫ్ నుంచి కేరళ చేరుకున్న భారతీయుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 09, 2020 | 7:09 PM

గల్ఫ్ దేశాలైన అబుదాబి, దుబాయ్ ల నుంచి శనివారం కేరళ చేరుకున్న363 మంది భారతీయుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వీరిలో ఒకరిని కోజికోడ్ లో. మరొకరిని కోచ్చిలోని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు 505 నమోదైనట్టు రాష్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 17 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 484 మంది కోలుకున్నారని, నలుగురు మరణించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. కాగా..  తమ రాష్ట్రంలో కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. తమ రాష్ట్ర మెడికల్ ఫెసిలిటీలను దేశంలోని ప్రముఖ సంస్థలు ప్రశంసిస్తున్నాయని ఆయన చెప్పారు.

అటు-మాల్దీవుల నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో 698 మంది భారతీయులు తరలి వస్తున్నారు. వీరినందరినీ కొచ్చి రేవులో దింపుతారు. అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాకే రాష్ట్ర అధికారులకు అప్పగించనున్నారు. రానున్న రోజుల్లో కొన్ని వేలమంది భారతీయులు కేరళ చేరుకోనున్నారు. వీరికోసం ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి విదితమే.