హైదరాబాద్ లో దిగే ఎన్నారైలకు ‘క్వారంటైన్ చార్జీల భారం’ !

‘మిషన్ వందే భారత్’ లో భాగంగా విదేశాల్లో చిక్కుబడిన ఎన్నారైలను ప్రత్యేక విమానాలు స్వదేశానికి తరలిస్తున్న గతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కువైట్ నుంచి హైదరాబాద్ కు శనివారం కొంతమంది ఎన్నారైలు చేరుకోనున్నారు. వీరికోసం కొన్ని హోటళ్లను, క్వారంటైన్ సెంటర్లను ఎంపిక చేసింది. వీటిలో వీరు మొదట 14 రోజులు గడపవలసి ఉంటుంది. విమాన చార్జీలతో బాటు ఈ హోటళ్లు, క్వారంటైన్ సెంటర్లలో తమ వసతికి గాను వీరు రూ. 5 వేల నుంచి 15 […]

  • Umakanth Rao
  • Publish Date - 6:03 pm, Sat, 9 May 20
హైదరాబాద్ లో దిగే ఎన్నారైలకు 'క్వారంటైన్ చార్జీల భారం' !

‘మిషన్ వందే భారత్’ లో భాగంగా విదేశాల్లో చిక్కుబడిన ఎన్నారైలను ప్రత్యేక విమానాలు స్వదేశానికి తరలిస్తున్న గతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కువైట్ నుంచి హైదరాబాద్ కు శనివారం కొంతమంది ఎన్నారైలు చేరుకోనున్నారు. వీరికోసం కొన్ని హోటళ్లను, క్వారంటైన్ సెంటర్లను ఎంపిక చేసింది. వీటిలో వీరు మొదట 14 రోజులు గడపవలసి ఉంటుంది. విమాన చార్జీలతో బాటు ఈ హోటళ్లు, క్వారంటైన్ సెంటర్లలో తమ వసతికి గాను వీరు రూ. 5 వేల నుంచి 15 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ వీరికి ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజుల అనంతరం తమ ఇళ్లకు వెళ్లిన తరువాత కూడా మరో పద్నాలుగు రోజుల పాటు  సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. మొత్తం సుమారు రెండున్నర వేల మంది ఆరు దేశాల నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు . కువైట్, యుఎస్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్, అబుదాబి తదితర దేశాల నుంచి రానున్న వీరి రాకతో ఈ నెల 17 వ తేదీ వరకు హైదరాబాద్ నగరం సందడిగా మారనుంది.