ప్ర‌పంచ వ్యాప్తంగా త‌గ్గిన క‌రోనా కేసులు… వంద‌లో ముగ్గురి మృతి… అమెరికాలో మాత్రం అదే తీవ్ర‌త‌…

క‌లియుగంపై క‌రోనా మ‌హ‌మ్మారి కాటు కొన‌సాగుతోంది. అయితే మొద‌ట ఉన్న తీవ్ర‌త ఇప్పుడు త‌గ్గినా... చ‌లికాలంలో వివిధ దేశాల్లో కోవిడ్ రెండో, మూడో ద‌శ‌లోకి ప్ర‌వేశించి త‌న వ్యాప్త‌ని కొన‌సాగిస్తోంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా త‌గ్గిన క‌రోనా కేసులు... వంద‌లో ముగ్గురి మృతి... అమెరికాలో మాత్రం అదే తీవ్ర‌త‌...
Follow us

|

Updated on: Nov 30, 2020 | 8:16 PM

క‌లియుగంపై క‌రోనా మ‌హ‌మ్మారి కాటు కొన‌సాగుతోంది. అయితే మొద‌ట ఉన్న తీవ్ర‌త ఇప్పుడు త‌గ్గినా… చ‌లికాలంలో వివిధ దేశాల్లో కోవిడ్ రెండో, మూడో ద‌శ‌లోకి ప్ర‌వేశించి త‌న వ్యాప్త‌ని కొన‌సాగిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 4,94,785 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,30,51,803కి చేరింది. రోజు వ్య‌వ‌ధిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 7210 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 14,64,756కి చేరింది. మొత్తం రికవరీ కేసులు 4,35,30,850కి చేరగా… యాక్టివ్ కేసులు 1,80,56,197కి చేరాయి. వీటిలో 1,05,543 మందికి కరోనా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల్లో ప్రతి 100 మందిలో ముగ్గురు దాకా చనిపోతున్నారు

అమెరికాలో అదే తీవ్ర‌త‌…

అమెరికాలో కరోనా తీవ్ర‌త కొనసాగుతోంది. కొత్తగా 1,34,165 మందికి వైరస్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,37,46,381కి చేరింది. 811 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 2,73,064కి చేరింది.

భార‌త్ రెండో స్థానంలో…

ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, టర్కీ, రష్యా, బ్రెజిల్ ఉన్నాయి. టర్కీలో కొత్తగా 29,281 కేసులొచ్చాయి. కొత్త మరణాలు 185 ఉన్నాయి. కరోనా మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (811) టాప్‌లో ఉండగా… మెక్సికో (586), ఇటలీ (541), ఇటలీ (541), రష్యా (459) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియా 6వ స్థానంలో ఉంది.