AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం స్టన్నింగ్ డెసిషన్.. మరి ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్ పనిచేస్తాయా?

ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఏంటంటే?.. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన చైనా యాప్స్ పని చేస్తాయా లేదా? ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లకు కంపెనీలు సేవలు అందిస్తాయా? నిషేధం ఎలా అమలవుతుంది? కంపెనీలు మూతపడటమేనా? అనేది చర్చనీయాంశంగా...

కేంద్రం స్టన్నింగ్ డెసిషన్.. మరి ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్ పనిచేస్తాయా?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 30, 2020 | 6:13 PM

Share

టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను బ్యాన్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం స్టన్నింగ్ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ యాప్‌ల ద్వారా భారత్ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు.. భారత్ ఎన్ని సార్లు విఙ్ఞప్తులు చేసినా డ్రాగన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

మరోవైపు గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశం తర్వాత చైనాపై మరోసారి వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. దీంతో ‘బాయ్‌కాట్ చైనా’ అంటూ సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఏంటంటే?.. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన చైనా యాప్స్ పని చేస్తాయా లేదా? ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లకు కంపెనీలు సేవలు అందిస్తాయా? నిషేధం ఎలా అమలవుతుంది? కంపెనీలు మూతపడటమేనా? అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా భారత ప్రభుత్వం మరికొన్ని యాప్స్‌ బ్యాన్‌పై కూడా సమీక్ష జరుపుతోంది. మరిన్న యాప్‌లు నిషేధిత జాబితాలో చేరతాయని సమాచారం.

నిషేధిత జాబితాలోని యాప్‌లను యాక్సెస్ చేసే అవకాశాన్ని నిలిపివేయాలని ఇంటెర్నెట్ అవసరం లేని క్యామ్‌స్కానర్‌ లాంటి యాప్స్ ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉంటే పని చేసే అవకాశం ఉంది. కానీ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకో అవకాశం అయితే లేదు. ఇక ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉన్నా.. ఇంటర్నెట్ అవసరమయ్యే టిక్‌టాక్, హలో, యూసీ బ్రౌజర్స్ వంటి యాప్‌లు పని చేసే అవకాశం ఉండక పోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Read More: 

బ్రేకింగ్: లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..

Follow Us
2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు!ఆ రహస్యం
2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు!ఆ రహస్యం
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే