ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న కేసుల సంఖ్య… తాజాగా మరో 37..

మొన్నమొన్నటి వరకు ఉత్తరాఖండ్‌లో పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు.. ఇప్పడు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. లాక్‌డౌన్ వెసులుబాటు కల్గించిన తర్వాత.. ఇక్కడ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న కేసుల సంఖ్య... తాజాగా మరో 37..
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 8:44 PM

మొన్నమొన్నటి వరకు ఉత్తరాఖండ్‌లో పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు.. ఇప్పడు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. లాక్‌డౌన్ వెసులుబాటు కల్గించిన తర్వాత.. ఇక్కడ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తాజాగా.. శుక్రవారం నాడు.. మరో 37 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,692కి చేరింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

శుక్రవారం నమోదైన కేసుల్లో.. రుద్రప్రయాగలో 7, హరిద్వార్‌లో 6,డెహ్రాడూన్‌లో 14 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 19 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 52.90గా ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 771 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 895 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. ఇక మరణాల సంఖ్య ఎనిమిది వేలకు చేరుకుంది.