చైనాలో కొత్తగా మరో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు

చైనా రాజధాని బీజింగ్ లో శుక్రవారం రెండు కొత్త కేసులు నమోద

చైనాలో కొత్తగా మరో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: Jun 12, 2020 | 8:41 PM

కరోనా పుట్టినిల్లులో మరోసారి కొత్త పాజిటివ్ కేసులు కలవరానికి గురిచేస్తోంది. కొవిడ్ కట్టడిలో ముందున్నామని చెప్పుకుంటున్న చైనా రాజధాని బీజింగ్ లో శుక్రవారం రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో రెండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన వీరిద్దరూ చైనా మాంసపు ఆహార సమగ్ర పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్నవారని తెలిపింది. అయితే, గత 55రోజుల్లో ఒక్కకేసు కూడా నమోదు కాని జీజింగ్‌లో తాజాగా రెండు రోజుల్లోనే మూడు కేసులు నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. తాజా కేసులతో అప్రమత్తమైన బీజింగ్ అధికారులు వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. మరోసారి వైరస్‌ విజృంభణ ఎప్పుడైనా రావచ్చని ఈ సంఘటన హెచ్చరిస్తున్నట్లు బీజింగ్‌ సీడీసీ అధికారులు గుర్తుచేశారు. వైరస్‌ తీవ్రత తగ్గిందనుకొని అత్యవసర స్థాయి లెవల్‌-2 నుంచి లెవల్‌-3కి తగ్గించిన సమయంలో కొత్త కేసులు వెలుగుచూస్తుండడంతో చైనా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇక రెండురోజుల క్రితం ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు 50మంది విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో పాఠశాలలు క్లస్టర్లుగా మారే అవకాశం ఉందని భావించిన అధికారులు వారితో సన్నితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే, ఆ విద్యార్థి తండ్రి బీజింగ్‌ దాటి బయటకు వెళ్లకున్నా వైరస్‌ ఎలా సంక్రమించిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్