US Covid Deaths: అమెరికాలో కోవిడ్ మరణ మృదంగం.. రెండో ప్రపంచ యుద్ద మృతుల సంఖ్యను దాటేసిన కరోనా మరణాలు

చైనాలో పుట్టిన కోవిడ్ 19 ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మరణించిన అమెరికన్ల కంటే కోవిడ్ మరణాల సంఖ్యే అధికం..

US Covid Deaths: అమెరికాలో కోవిడ్ మరణ మృదంగం.. రెండో ప్రపంచ యుద్ద మృతుల సంఖ్యను దాటేసిన కరోనా మరణాలు
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2021 | 3:50 PM

US Covid Deaths: “చైనాలో పుట్టిన కోవిడ్ 19 ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. అమెరికాలో కరోనా కేసులు వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ రోజురోజుకీ భారీ సంఖ్యంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణ సంఖ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్యను దాటిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 4,05,399 అమెరికన్ సైనికులు మరణించగా బుధవారం సాయంత్రం నాటికి, యునైటెడ్ స్టేట్ లో కరోనా వైరెస్ వ్యాధితో 4,05,400 మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

అమెరికాలో కరోనా తీవ్రత రోజు రోజుకీ మరింత ఎక్కువ అవుతుంది. రానున్న రోజుల్లో మరింత క్లిష్ట, ప్రాణాంతక సమయంలోకి అడుగు పెడుతున్నాం.. ఇలాంటి చీకటి సమయాన్ని మనమందరం కలసికట్టుగా ఎదుర్కోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ఈ మహమ్మారి కారణంగా ప్రతిరోజు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఫిబ్రవరిలో 5లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. కాగా.. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే బైడెన్.. కొవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం చేశారు. అమెరికాకు వెళ్లే ప్రయాణికులకు నెగటివ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేస్తూ ఆ దేశం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బైడెన్ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌తోపాటు క్వారెంటైన్‌ తప్పనిసరి అయింది.

ఇదిలా ఉంటే.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. రాబోయే మూడు వారల్లో కొవిడ్ కారణంగా అమెరికాలో 90వేల మంది మరణించొచ్చని గత వారం వెల్లడించింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. ఫిబ్రవరి 6 నాటికి అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య 4.40-4.77లక్షల మధ్య ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read: కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం.. ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం