AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ సర్కార్‌ కీలక నిర్ణయం: కరోనా పేషెంట్ల డైట్‌ చార్జీల పెంపు!

ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగుల డైట్‌ చార్జీలను కూడా ప్రభుత్వంపెంచుతున్నట్లు తెలుస్తోంది.

టీ సర్కార్‌ కీలక నిర్ణయం: కరోనా పేషెంట్ల డైట్‌ చార్జీల పెంపు!
Jyothi Gadda
|

Updated on: Jul 15, 2020 | 2:49 PM

Share

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ మరింత ప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్‌ కాలేజీల్లో ఉచితంగా కరోనా టెస్టులతో పాటు చికిత్స అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగుల డైట్‌ చార్జీలను కూడా ప్రభుత్వంపెంచుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కోవిడ్‌ బాధితులకు అందిస్తున్న భోజనానికి రోజుకు సాధారణ డైట్‌కు రూ.40, హైప్రొటీన్‌ డైట్‌కు రూ.56 చొప్పున చెల్లిస్తుంది ప్రభుత్వం. అయితే కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చిన తర్వాత కరోనా పేషెంట్లకు బలవర్థకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. అందుకోసం డైట్‌ చార్జీని రూ.275కు పెంచారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు మాత్రమే ఈ డైట్‌ చార్జీ వర్తించనుంది. అలాగే జిల్లాల్లో అయితే రూ.200గా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నట్లు అధికార వర్గాల సమాచారం.

ఇక గాంధీలో కోవిడ్‌ పేషెంట్లకు అందించే మెనెలో ..ఉదయం 7 గంటలకు – బ్రెడ్‌, పాలు ఇస్తున్నారు. ఉదయం 8 గంటలకు- అల్పాహారంగా ఉప్మా, ఇడ్లీ, వడ, పూరి- ఏదో ఒకటి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చే భోజనంలో కూర, పప్పు, సాంబారు, గుడ్డు, హైప్రొటీన్‌ గింజలు, సీ విటమిన్‌ పండు, వాటర్‌ బాటిల్‌ను అందజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం 3గంటలకు – టీ, బిస్కెట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు 100 గ్రాముల డ్రై ఫ్రూట్స్‌ ఇస్తున్నారు. రాత్రి గం.7.30- భోజనంలో చపాతి, పుల్కా, అన్నం, కూర, రసం, పెరుగు, ఒక వాటర్‌ బాటిల్‌. రాత్రి 9 గంటలకు – గ్లాసుడు పాలు, పండ్లు ఇస్తున్నారు.

సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!
గుడ్‌న్యూస్.. అమెరికాలో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్ ఏర్పాటు!
గుడ్‌న్యూస్.. అమెరికాలో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్ ఏర్పాటు!
వేలంలో రూ. 25 కోట్లతో రికార్డ్.. కట్‌చేస్తే డకౌట్‌
వేలంలో రూ. 25 కోట్లతో రికార్డ్.. కట్‌చేస్తే డకౌట్‌