TS Corona Cases: తెలంగాణలో మరోసారి కరోనా గుబులు.. గడిచిన 24గంటల్లో పెరిగిన కొత్త కేసులు.. ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటితో పోల్చితే.. కొవిడ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. గడచిన 24 గంటల వ్యవధిలో 70,974 కరోనా పరీక్షలు నిర్వహించగా, 315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

TS Corona Cases: తెలంగాణలో మరోసారి కరోనా గుబులు.. గడిచిన 24గంటల్లో పెరిగిన కొత్త కేసులు.. ఇద్దరు మృతి
Telangana Corona
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2021 | 8:04 PM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటితో పోల్చితే.. కొవిడ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. గడచిన 24 గంటల వ్యవధిలో 70,974 కరోనా పరీక్షలు నిర్వహించగా, 315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866కు చేరుకుంది. ఇక, నిన్న ఒక్కరోజే ఇద్దరు కరోనా వైరస్ బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 3,897కు చేరిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య ఈ సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

అదే సమయంలో 318 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,52,716 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,253 మంది చికిత్స పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 75 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి.

ఇప్పటివరకు తెలంగాణలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.

Telangana Coronavirus

Read Also…  Viral Photo: శరీరాన్ని విల్లులా వంచిన ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? భారీ పాన్‌ ఇండియా చిత్రంతో..

CM KCR: ఈ నెల 14న యాదాద్రికి సీఎం కేసీఆర్.. యాదాద్రి అభివృద్ధి ప‌నుల‌ ప‌రిశీలన

Gujarat Heavy Rains: గుజరాత్ రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు.. నీట మునిగిన రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాలు!