AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRDIA: కరోనా కవచ్ ప్రత్యేక పాలసీ గడువును ఆరునెలలు పెంచిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ..ఈ పాలసీ పూర్తి వివరాలివే!

కరోనా మూడో వేవ్ వస్తుందనే నిపుణుల హెచ్చరికల నేపధ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ (IRDIA) ప్రజలకు శుభవార్త చెప్పింది.

IRDIA: కరోనా కవచ్ ప్రత్యేక పాలసీ గడువును ఆరునెలలు పెంచిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ..ఈ పాలసీ పూర్తి వివరాలివే!
Corona Kavach Policy
KVD Varma
|

Updated on: Sep 13, 2021 | 9:02 PM

Share

IRDIA: కరోనా మూడో వేవ్ వస్తుందనే నిపుణుల హెచ్చరికల నేపధ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ (IRDIA) ప్రజలకు శుభవార్త చెప్పింది. కరోనా నేపధ్యంలో ప్రవేశపెట్టిన కరోనా కవచ్ ప్రత్యేక పాలసీ గడువును పెంచాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. నిజానికి ఈ పాలసీ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది. అయితే, కరోనా మూడో వేవ్ కారణంగా ఈ పాలసీ గడువును మరో ఆరునెలలు అంటే మార్చి 31, 2022 వరకూ పెంచాలని చెప్పింది.

కరోనా కవచ్ పాలసీతో లభించే ఉపయోగాలు ఇవే..

1) నష్టపరిహార ఆరోగ్య బీమా ఉత్పత్తులు, ఆసుపత్రి ఖర్చుల కవర్

2) రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు బేసిక్ కవర్‌లో బీమా మొత్తం

3) మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలలు కవర్

4) కొత్త పాలసీలో 15 రోజుల పాటు వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది

5) 18 – 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా కొనుగోలు చేయవచ్చు

6) 14 రోజుల హోం క్వారంటైన్ కు కూడా.. హోం క్వారంటైన్ సమయంలో చేయవలసిన చికిత్స ఖర్చును కవర్ చేస్తుంది

7) అన్ని కంపెనీల ఒకే ఉత్పత్తి

8) కరోనా చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది

9) మిగిలిన ఆరోగ్య బీమా పాలసీ కంటే ప్రీమియం తక్కువ

ఆసుపత్రి ఖర్చులను చాలా తక్కువ ప్రీమియంతో కవర్ చేసే కరోనా కవచ్ పాలసీకి చాలా బలమైన స్పందన లభించింది.

ఇప్పుడు, కరోనా ప్రత్యేక ఉత్పత్తులు మార్చి 31, 2022 వరకు అందుబాటులో ఉంటాయి. తక్కువ ప్రీమియమ్‌లలో కరోనా ఉత్పత్తులకు బలమైన స్పందన లభించింది. మిలియన్ల మంది ప్రజలు చాలా తక్కువ ప్రీమియంతో కరోనా పాలసీని పొందారు.

కరోనా విరుచుకు పడుతున్న నేపధ్యంలో కరోనా నుంచి రక్షణ కోసం సామాన్యులకు అందుబాటులో ఉండేలా పాలసీలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది . దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ఐఆర్‌డీఏ మార్గదర్శకాలను అనుసరించి కరోనా కోసం ప్రత్యేక బీమా పాలసీలను ప్రకటించాయి. ‘కరోనా కవచ్‌’, ‘కరోనా రక్షక్‌’, ‘ఆరోగ్య సంజీవనీ’ పేర వ్యక్తిగత, కుటుంబ, గ్రూపు పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. రిలయన్స్‌, ఫ్యూచర్‌ జనరల్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ వంటి కంపెనీలు గ్రూపు బీమా పాలసీలను అమలు చేస్తున్నాయి. ఓరియంటల్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌, స్టార్‌ హెల్త్‌ వంటి కంపెనీలు వ్యక్తిగత, కుటుంబ పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.