Gujarat Heavy Rains: గుజరాత్ రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు.. నీట మునిగిన రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాలు!
గుజరాత్ రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా వానలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లో అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు ముంచెత్తాయి.
Gujarat Heavy Rains: గుజరాత్ రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా వానలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లో అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు ముంచెత్తాయి. వరుసగా రెండోరోజు కూడా భారీవర్షం కురియడంతో జనజీవితం స్తంభించింది. భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లు, కాలనీలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం రాజ్‌కోట్‌లోని ధోరాజీ, పాదద్రి మరియు గోండల్ తాలూకాలో భారీ వరదలు సంభవించాయి. జామ్‌నగర్‌లోని కలవాడ్ ధ్రోల్ తాలూకాలో కూడా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. జామ్‌నగర్ జిల్లా ఖిమ్రానా గ్రామం వరద నీటితో నిండిపోయింది. గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు నిలిచిపోయినట్లు సమాచారం. అలియాబాడా గ్రామంలో వర్షం కారణంగా నడుము లోతులో నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో NDRF బృందాలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షం కారణంగా రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ పాఠశాలలు, కళాశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించారు.
#WATCH : Heavy #rains in and around #Jamnagar city. Ongoing rescue process in #Khimrana village. pic.twitter.com/gyGrAY6U5m
— ज़ाहिद अब्बास ZAHID ABBAS ?? (@abbaszahid24) September 13, 2021
భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన గుజరాత్ రాష్ట్రానికి మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. మళ్లీ దంచికొట్టేందుకు వరుణుడు సిద్ధవుతున్నాడు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వాతావరణ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి.
गुजरात में बाढ़: बादल फटने से राजकोट में 24 घंटे में 7 और जामनगर में 10 इंच बारिश, कई इलाकों में 8 फीट तक पानी भराhttps://t.co/qNDGx53qpt #gujaratrains #Floods @BJP4Gujarat
— Dainik Bhaskar (@DainikBhaskar) September 13, 2021
#Gujarat #jamnagar के सभी डेम ओवरफ्लो , निचले इलाके डूबे , लोगो को सुरक्षित निकाला गया @news24tvchannel@CollectorJamngr @SP_Jamnagar @MPJamnagaroffic #gujaratrains pic.twitter.com/gw2fD1hwpL
— Thakur BhupendraSingh (@BhupendraNews24) September 13, 2021