60 రోజుల ఇమ్మిగ్రేషన్ నిలిపివేత.. క్లారిటీ ఇఛ్చిన ట్రంప్
అమెరికాలో వలసలకు సంబంధించి తాను జారీ చేసిన 60 రోజుల నిషేధంపై అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇఛ్చారు. ఇది కేవలం గ్రీన్ కార్డు హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుందని, తాత్కాలికంగా తమ దేశంలోకి ఎంటరయ్యేవారికి కాదని ఆయన స్పష్టం చేశారు. మా దేశంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవాలనుకునేవారికే ఈ బ్యాన్ వర్తిస్తుంది అని ఆయన చెప్పారు. 60 రోజుల అనంతరం తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని సమీక్షిస్తానని, ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. నా […]

అమెరికాలో వలసలకు సంబంధించి తాను జారీ చేసిన 60 రోజుల నిషేధంపై అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇఛ్చారు. ఇది కేవలం గ్రీన్ కార్డు హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుందని, తాత్కాలికంగా తమ దేశంలోకి ఎంటరయ్యేవారికి కాదని ఆయన స్పష్టం చేశారు. మా దేశంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవాలనుకునేవారికే ఈ బ్యాన్ వర్తిస్తుంది అని ఆయన చెప్పారు. 60 రోజుల అనంతరం తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని సమీక్షిస్తానని, ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. నా ఉత్తర్వుల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. మొదట నిరుద్యోగులైన అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది నా లక్ష్యం అన్నారు. ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో హెచ్ 1 బీ వీసా ఆశిస్తున్న వేలాది భారతీయుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. తాత్కాలిక వీసా పై రావాలనుకునేవారు తమ దేశానికి వస్తుండవచ్ఛునని ట్రంప్ చెప్పడం వారికి ఆశాకిరణమైంది.