హైడ్రాక్సీ క్లోరోక్విన్​పై కేంద్రం కీల‌క సూచ‌న‌లు…అలా చేస్తే డేంజ‌ర్..

క‌రోనా క‌ట్ట‌డిలో కీల‌కంగ చెబుతోన్న‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ వినియోగాలపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క‌ సూచనలు చేసింది. డాక్ట‌ర్ ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మ‌కాలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మెడిసిన్ కొవిడ్-19 రోగులకు ట్రీట్మెంట్ చేసే ఆరోగ్య కార్యకర్తలు, మెడిక‌ల్ స్టాఫ్ మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా పాజిటివ్ రోగి నుంచి వైరస్ సంక్రమించిన సన్నిహితులే వినియోగించాలని స్పష్టం చేసింది. డాక్ట‌ర్స్ పర్యవేక్షణ లేకుండా స‌ద‌రు మెడిసిన్ తీసుకోవడం హానికరమని ప్రభుత్వం […]

హైడ్రాక్సీ క్లోరోక్విన్​పై కేంద్రం కీల‌క సూచ‌న‌లు...అలా చేస్తే డేంజ‌ర్..
Follow us

|

Updated on: Apr 22, 2020 | 2:47 PM

క‌రోనా క‌ట్ట‌డిలో కీల‌కంగ చెబుతోన్న‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ వినియోగాలపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క‌ సూచనలు చేసింది. డాక్ట‌ర్ ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మ‌కాలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మెడిసిన్ కొవిడ్-19 రోగులకు ట్రీట్మెంట్ చేసే ఆరోగ్య కార్యకర్తలు, మెడిక‌ల్ స్టాఫ్ మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.

క‌రోనా పాజిటివ్ రోగి నుంచి వైరస్ సంక్రమించిన సన్నిహితులే వినియోగించాలని స్పష్టం చేసింది. డాక్ట‌ర్స్ పర్యవేక్షణ లేకుండా స‌ద‌రు మెడిసిన్ తీసుకోవడం హానికరమని ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్యంపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్ర‌జ‌ల శరీరాలపై కూడా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చెయ్య‌డం ప్రమాదకరమని సూచించింది. వస్తువులు, ఉపరితలాలపై మాత్రమే హైపోక్లోరైడ్ స్ప్రే చెయ్యాల‌ని స్పష్టం చేసిన ప్ర‌భుత్వం.. వ్యక్తులు, సమూహంగా ఉన్న వారిపై ద్రావణం పిచికారి నిషేధించింది.