కరోనా.. ఇండియా.. 33 వేలకు చేరుకున్న కేసులు.. పెరిగిన రీకవరీ రేటు

ఇండియాలో 33,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 8,325 మంది కరోనా రోగులు కోలుకున్నారు. మృతుల సంఖ్య 1074 కి పెరిగింది. అయితే 14 రోజుల క్రితం రికవరీ రేటు 13 శాతం ఉండగా తాజాగా గురువారం నాటికి అది 25 శాతానికి పైగా పెరిగింది. గత 24 గంటల్లో 1718 కేసులు నమోదు కాగా.. 67 మంది రోగులు మరణించారు. ఇక కరోనా హాట్ స్పాట్ జిల్లాల సంఖ్య 170 నుంచి 129 కి తగ్గింది. […]

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 30, 2020 | 5:01 PM

ఇండియాలో 33,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 8,325 మంది కరోనా రోగులు కోలుకున్నారు. మృతుల సంఖ్య 1074 కి పెరిగింది. అయితే 14 రోజుల క్రితం రికవరీ రేటు 13 శాతం ఉండగా తాజాగా గురువారం నాటికి అది 25 శాతానికి పైగా పెరిగింది. గత 24 గంటల్లో 1718 కేసులు నమోదు కాగా.. 67 మంది రోగులు మరణించారు. ఇక కరోనా హాట్ స్పాట్ జిల్లాల సంఖ్య 170 నుంచి 129 కి తగ్గింది. ఇన్ఫెక్షన్ ఫ్రీ జిల్లాలు లేదా గ్రీన్ జోన్లుగా వర్గీకరించిన జిల్లాల్లో లాక్ డౌన్ పాక్షిక సడలింపుల కారణంగా మళ్ళీ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. నిర్ణీత వేళల్లో కిరానా దుకాణాలు తెరిచారు.