టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. గత వారం వెబ్ సిరీస్ షూటింగ్ డైరెక్ట్ చేశారు తేజ. దీంతో ఆయ‌న‌తో ప‌ని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు చేశారు వైద్యులు. ఈ రిపోర్టుల్లో తేజ‌కు త‌ప్ప...

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 03, 2020 | 2:25 PM

ప్ర‌ముఖుల‌పై కోవిడ్ మ‌హ‌మ్మారి పంజా విసురుతోంది. సామాన్యుల‌తో పాటు వారికి కూడా ఈ వైర‌స్ సోకుతూండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు రాజకీయ నాయ‌కులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి కూడా క‌రోనా పాజిటివ్ రావ‌డం అంద‌రినీ షాక్ గురి చేసింది. ఇక టాలీవుడ్‌లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కూడా ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డిన విష‌యం మ‌రువ‌క ముందే మ‌రో టాలీవుడ్ డైరెక్ట‌ర్‌కి క‌రోనా సోకింది.

తాజాగా టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. గత వారం వెబ్ సిరీస్ షూటింగ్ డైరెక్ట్ చేశారు తేజ. దీంతో ఆయ‌న‌తో ప‌ని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు చేశారు వైద్యులు. ఈ రిపోర్టుల్లో తేజ‌కు త‌ప్ప మిగ‌తావారంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది. కాగా ప్ర‌స్తుతం తేజ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Read More:

మంత్రి కేటీఆర్‌కు రాఖీ క‌ట్టిన క‌విత‌

సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండుగ‌ శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్

ప్ర‌పంచంపై క‌రోనా టెర్ర‌ర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu