రాఖీ పండుగః మ‌హిళ‌ల‌ కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక

రాఖీ పండుగః మ‌హిళ‌ల‌ కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక

రాఖీ పండుగ‌ పుర‌స్క‌రించుకుని మ‌హిళ‌ల‌కు సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక అందించారు. ఇప్ప‌టికే మ‌హిళల కోసం దిశ చ‌ట్టం, కేసుల న‌మోదు కోసం ప్ర‌త్యేకంగా యాప్‌, మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక పోలీస్ స్టేష‌న్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం.. తాజాగా రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా 'ఈ -ర‌క్షాబంధ‌న్' కార్య‌క్ర‌మాన్ని..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 03, 2020 | 3:32 PM

రాఖీ పండుగ‌ పుర‌స్క‌రించుకుని మ‌హిళ‌ల‌కు సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక అందించారు. ఇప్ప‌టికే మ‌హిళల కోసం దిశ చ‌ట్టం, కేసుల న‌మోదు కోసం ప్ర‌త్యేకంగా యాప్‌, మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక పోలీస్ స్టేష‌న్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం.. తాజాగా రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ‘ఈ -ర‌క్షాబంధ‌న్’ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాల‌లు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం పోలీస్ శాఖ‌, సీఐడీ విభాగం సంయుక్తంగా ‘ఈ -ర‌క్షాబంధ‌న్’ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. సైబ‌ర్ నేరగాళ్ల నుంచి మ‌హిళ‌ల‌ను ర‌క్షించేందుకు, అలాగే సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్ర‌భుత్వం. కాగా నెల రోజుల పాటు ప్ర‌త్యేక స‌ద‌స్సులు, స‌మావేశాలను నిర్వ‌హిస్తారు.

‘ఈ ర‌క్షాబంధ‌న్’ కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉద‌యం 11 గంటల నుంచి అవ‌గాహ‌నా కార‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. షార్ట్ ఫిలిమ్స్, యానిమేష‌న్స్, రీడింగ్ మెటీరియ‌ల్స్ ద్వారా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. ఇటీవ‌లే సోష‌ల్ మీడియా ద్వారా మోసాలు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి త‌దిత‌ర మోసాల నుంచి త‌మ‌ని తాము ర‌క్షించుకునేందుకు ఈ కార్య‌క్ర‌మం ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది. అలాగే వైట్ క‌ల‌ర్ నేరాల బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఏదైనా దాడులు జ‌రిగిన‌ప్పుడు ఏవిధంగా స్పందించాలి? వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి? అనే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. అక్కాచెల్లెమ్మ‌ల‌కు ఏదైనా స‌మ‌స్య ఉంటే దిశ యాప్‌, దిశ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదులు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇక త‌మ ప్ర‌భుత్వం మ‌హిళా సాధికారిత‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని పున‌రుద్ఘాటించారు. అలాగే మ‌హిళ‌ల‌కు సంబంధించిన అన్ని రంగాల్లో వారికి 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించామ‌ని గుర్తు చేశారు. ఇక ఈ నెల 12న వైఎస్సార్ చేయూత ప‌థ‌కాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలిపారు సీఎం జ‌గ‌న్.

Read More:

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

మంత్రి కేటీఆర్‌కు రాఖీ క‌ట్టిన క‌విత‌

సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండుగ‌ శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu