AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 30కి చేరిన క‌రోనా కేసులు…తాజాగా మ‌రో మూడు

తెలంగాణ‌లో మ‌రింత అప్ర‌మ‌త్తం..లాక్‌డౌన్ మ‌రింత క‌ఠిన‌త‌రంగా మార‌నుంది. ఒకే రోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి పెరిగింది. ..

తెలంగాణలో 30కి చేరిన క‌రోనా కేసులు...తాజాగా మ‌రో మూడు
Jyothi Gadda
|

Updated on: Mar 23, 2020 | 2:06 PM

Share

తెలంగాణ‌లో మ‌రింత అప్ర‌మ‌త్తం..లాక్‌డౌన్ మ‌రింత క‌ఠిన‌త‌రంగా మార‌నుంది. ఒకే రోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి పెరిగింది. ఫ్రాన్స్, లండన్ నుంచి వచ్చినవారికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

రాష్ట్రంలో కరోనా కేసులు 30కి చేరాయి. ఈ రోజు ఒక్కరోజే కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి, ఫ్రాన్స్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా టెస్టులు చేయ‌గా, రిపోర్ట్స్‌లో పాజిటివ్‌గా వచ్చింది. అటు, ఇండోనేషియా బృందంతో తిరిగిన కరీంనగర్ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో తెలంగాణ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు. ఒక్కరోజులోనే మూడు కేసులు కొత్తగా నమోదుకావడంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. మార్చి 31 వరకు జనాలెవరూ రోడ్లమీదికి రావొద్దని హెచ్చరించారు.

Follow Us