తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు..

గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించింది ఆరోగ్యశాఖ. దీంతో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 1107కి..

తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు..

గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించింది ఆరోగ్యశాఖ. దీంతో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 1107కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 29 మంది కరోనాతో మృతి చెందారు. కాగా ఇవాళ 20 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 648కి చేరింది. కాగా ప్రస్తుతం తెలంగాణలో 430 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే జీహెచ్‌ఎంసీ మినహా ఇతర జిల్లాల్లో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, కరోనా ఫ్రీ జిల్లాలు కూడా పెరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కాగా ఈ నెల 29వ తేదీ వరకూ తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. అందులోనూ ముఖ్యంగా రెడ్‌జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో మరిన్న కఠిన శిక్షలు అమలు కానున్నాయని పేర్కొన్నారు.

Read More:

మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి!

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసుపై శ్రీముఖి రియాక్షన్

హైదరాబాద్‌లో మరిన్ని కఠిన ఆంక్షలు.. అధికారులకు సీఎం దిశానిర్ధేశం