AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొద్దు నిద్రే క‌రోనాకు చెక్ అట‌..

ఒక‌వేళ క‌రోనా సోకినా కూడా ఆందోళ‌న చెంద‌కుండా ధైర్యంగా ఉండండి. వైర‌స్ ద‌రి చేర‌నీయ‌కుండా ఉండేందుకు.. రోజుకీ హాయిగా ఎనిమిది గంట‌లు నిద్ర‌పోండి. అలా ఎంత ఎక్కువ‌గా నిద్ర‌పోతే అంత మంచిద‌ట‌. ఇక‌ ప్ర‌య‌త్నించినా నిద్ర ప‌ట్ట‌డం లేదు అంటారా..

మొద్దు నిద్రే క‌రోనాకు చెక్ అట‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 26, 2020 | 5:20 PM

Share

క‌రోనా వైర‌స్ పేరు ఎత్తుతేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, న‌టులు, వీఐపీలు, పోలీసులు, వైద్య సిబ్బంది ఇలా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారికి సరైన వ్యాక్సిన్ రాక‌పోవ‌డంతో.. ఇమ్యునిటీని పెంచుకోవ‌డ‌మే సరైన మార్గ‌మ‌ని.. శాస్త్ర‌వేత్త‌లు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఈ ఇమ్యునిటీలో నిద్ర కూడా ఒక భాగ‌మ‌ట‌. స‌రిగ్గా నిద్ర‌పోక‌పోతే శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గిపోతాయ‌ట‌. శ‌రీరంలో వైర‌స్ బారిన ప‌డిన క‌ణాల్ని చంపేవి కూడా ఇవే. కాబ‌ట్టి నిద్ర త‌క్కువ‌య్యే కొద్దీ ఒంట్లో వైర‌స్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు వైద్యులు.

ఒక‌వేళ క‌రోనా సోకినా కూడా ఆందోళ‌న చెంద‌కుండా ధైర్యంగా ఉండండి. వైర‌స్ ద‌రి చేర‌నీయ‌కుండా ఉండేందుకు.. రోజుకీ హాయిగా ఎనిమిది గంట‌లు నిద్ర‌పోండి. అలా ఎంత ఎక్కువ‌గా నిద్ర‌పోతే అంత మంచిద‌ట‌. ఇక‌ ప్ర‌య‌త్నించినా నిద్ర ప‌ట్ట‌డం లేదు అంటారా అయితే ఇలా చేయండి. ఉద‌యాన్నే కాసేపు ఎండ‌లో ఉండండి. రోజంతా చ‌లాకిగా ఉంటారు. రాత్రి పూట నిద్ర బాగా ప‌డుతుంది. మ‌ధ్యాహ్నం అస్స‌లు నిద్ర‌పోకూడ‌దు. ఎందుకంటే రాత్రి నిద్ర ప‌ట్ట‌దు కాబ‌ట్టి. రాత్రి నిద్రే మ‌నిషి ఆరోగ్యానికి మంచిది. అలాగే కాఫీ, టీలు కూడా తాగ‌డం త‌గ్గించాలి. అలాగే రాత్రి భోజ‌నంలో తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారాన్ని తీసుకోవ‌డం మంచిది. ఇక నిద్ర‌పోయే ముందు పాలు లేదా మ‌జ్జిగ తాగితే నిద్ర బాగా ప‌డుతుంద‌ని చెబుతున్నారు వైద్యులు.

Read More: 

వైర‌ల్ వీడియో: వ‌రుస‌గా రోడ్డు దాటుతున్న మొస‌ళ్లు.. ఆశ్చ‌ర్య‌పోయిన జ‌నం..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ మెగాస్టార్‌, ప‌వ‌ర్ స్టార్‌

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో