ప్రపంచవ్యాప్తంగా 16 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా 16,226,492 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 648,866 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 9,928,755 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా 16 మిలియన్లు దాటిన కరోనా కేసులు..
Follow us

|

Updated on: Jul 26, 2020 | 5:38 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16,226,492 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 648,866 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 9,928,755 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 257,789 పాజిటివ్ కేసులు, 5689 మరణాలు సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,315,709), మరణాలు(149,398) సంభవించాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 1,390,429 నమోదు కాగా, మృతుల సంఖ్య 32,151కి చేరింది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!

గుడ్ న్యూస్: ‘రెమ్‌డెసివర్‌’ మందు కావాలా.? తెలుగు రాష్ట్రాల్లో దొరికేది ఇక్కడే..!

కిమ్ ఇలాకాలో మొదటి కరోనా కేసు.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్..!

ఏపీలోని ఆ ప్రాంతంలో వారం రోజుల లాక్‌డౌన్..

గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి మరో 21 మందులు..!