గుడ్ న్యూస్: ‘రెమ్‌డెసివర్‌’ మందు కావాలా.? తెలుగు రాష్ట్రాల్లో దొరికేది ఇక్కడే..!

'రెమ్‌డెసివర్‌' మందును బ్లాక్ మార్కెట్‌లో దళారులు భారీ ధరలకు విక్రయిస్తున్న నేపధ్యంలో సంస్థ ఎండీ పార్థసారథి రెడ్డి.. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో..

గుడ్ న్యూస్: 'రెమ్‌డెసివర్‌' మందు కావాలా.? తెలుగు రాష్ట్రాల్లో దొరికేది ఇక్కడే..!
Follow us

|

Updated on: Jul 26, 2020 | 2:20 PM

Coronavirus Remdesivir Injections: ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో కరోనా రోగుల కోసం ‘రెమ్‌డెసివర్‌’ ఇంజెన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటిని విషమ పరిస్థితిలో ఉన్న బాధితులకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల ఈ ‘రెమ్‌డెసివర్‌’ మందును బ్లాక్ మార్కెట్‌లో దళారులు భారీ ధరలకు విక్రయిస్తున్న నేపధ్యంలో సంస్థ ఎండీ పార్థసారథి రెడ్డి.. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్ , విజయవాడ హెటిరో కార్యలయాల్లో ‘రెమ్‌డెసివర్‌’ ఇంజెక్షన్లను అందుబాటులోకి ఉంచారు. కరోనా మందు కావాల్సిన వారు ఈ కీలక పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • పేషేంట్ ఆధార్ కార్డు కలర్ జిరాక్స్
  •  కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ జిరాక్స్
  • ఒరిజినల్ హాస్పిటల్ అడ్మిట్ కార్డు.. దానిపై ఇన్ పేషెంట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి
  • డాక్టర్ స్టాంప్, సంతకం కలిగిన ప్రిస్క్రిప్షన్ స్లిప్
  • ‘రెమ్‌డెసివర్‌’ ఇంజెక్షన్ కోసం సంబంధిత హెటిరో కార్యాలయానికి వచ్చినవారు.. వారి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాని జిరాక్స్ కాపీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • రూ. 32.400/- నెట్ క్యాష్ కూడా తీసుకురావాలి.
  • ఉదయం 10 నుండి సాయంత్రం 5 మధ్య మాత్రమే పని వేళలు.(కార్డులు చెల్లుబాటు కావు)

హెటిరో సంస్థ కార్యాలయం- హైదరాబాద్: House No 8-3-166/1&2, 1st Floor Challa’s Estate, 18, Sultan Bagh, Erragadda, Moosapet, Hyderabad, Telangana 500082. Phone: 040 -23707171. Near Metro Pillar No. ERG 18

హెటిరో సంస్థ కార్యాలయం- విజయవాడ: D.No.26-3-126, 2nd Floor, Nageswara Rao Pantulu Road, Gandhinagar, VIJAYAWADA – 520003, Krishna District, A.P.. Phone: 0866-6615811

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!

కిమ్ ఇలాకాలో మొదటి కరోనా కేసు.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్..!

ఏపీలోని ఆ ప్రాంతంలో వారం రోజుల లాక్‌డౌన్..

గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి మరో 21 మందులు..!

Latest Articles