రేషన్ డీలర్లకు ఏపీ ప్రభుత్వం తీపీకబురు…
ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు తీపికబురు అందించింది. లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేసినందుకు గాను జూన్ నెలకు చెల్లించాల్సిన రూ. 19.33 కోట్లు కమీషన్ మొత్తాన్ని విడుదల చేసింది.

Good News To Ration Dealers: ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు తీపికబురు అందించింది. లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేసినందుకు గాను జూన్ నెలకు చెల్లించాల్సిన రూ. 19.33 కోట్లు కమీషన్ మొత్తాన్ని విడుదల చేసింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 వేల మంది రేషన్ డీలర్లకు లబ్ది చేకూరనుంది. కాగా, కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ఏప్రిల్ నుంచి నెలకు రెండు విడతలుగా ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీలర్లకు జూన్ నెలలో రెండు విడతలుగా పంపిణీ చేసిన రేషన్ సరుకులకు గాను ప్రభుత్వం కమీషన్‌ను మంజూరు చేసింది. ఈ మొత్తం నేరుగా రేషన్ డీలర్ల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!
కిమ్ ఇలాకాలో మొదటి కరోనా కేసు.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్..!
