‘థ్యాంక్యూ’..ఎఫ్‌డీఐ పాలసీ సవరణ పై రాహుల్ గాంధీ

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులఫై  పాలసీని ప్రభుత్వం సవరించిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. నా హెచ్చరికను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ డీ ఐ నిబంధనలను సవరించినందుకు ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు. కరోనా కారణంగా క్షీణిస్తున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ దృష్ట్యా.. మన కంపెనీలను విదేశాలు టేకోవర్ చేసే ప్రమాదం ఉందని ఈ నెల 12 న ఆయన ట్వీట్ చేశారు. ఇండియాలో ఎఫ్‌డీఐలను రెండు కేటగిరీల కింద అనుమతిస్తున్నారు. ఆటోమాటిక్  […]

'థ్యాంక్యూ'..ఎఫ్‌డీఐ పాలసీ సవరణ పై రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 18, 2020 | 7:28 PM

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులఫై  పాలసీని ప్రభుత్వం సవరించిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. నా హెచ్చరికను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ డీ ఐ నిబంధనలను సవరించినందుకు ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు. కరోనా కారణంగా క్షీణిస్తున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ దృష్ట్యా.. మన కంపెనీలను విదేశాలు టేకోవర్ చేసే ప్రమాదం ఉందని ఈ నెల 12 న ఆయన ట్వీట్ చేశారు.

ఇండియాలో ఎఫ్‌డీఐలను రెండు కేటగిరీల కింద అనుమతిస్తున్నారు. ఆటోమాటిక్  (ప్రభుత్వ అనుమతి అవసరం లేని కంపెనీలు), ‘వయా ది గవర్నమెంట్’ (ప్రభుత్వ అనుమతి తప్పనిసరైన సంస్థలు) అన్నవే ఈ కేటగిరీలు. ఇదివరకటి పాలసీ ప్రకారం.. పొరుగునున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల నుంచి కంపెనీలు ప్రభుత్వ అనుమతి పొందాల్సి వచ్ఛేది. కానీ ఇప్పుడు చైనా కంపెనీలకు కూడా ఈ నిబంధనను వర్తింపజేస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా  ఎకానమీపై నీలినీడలు పరచుకున్న తరుణంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.. భారత వృద్ది రేటు ఈ ఏడాదికి గాను 1.9 శాతం మాత్రం ఉండగలదని అంచనా వేసింది. ఇప్పటికే దాదాపు నష్టాల బాటలో ఉన్న ఉత్పాదక రంగం లాక్ డౌన్ కారణంగా మరింత కుంగిపోయింది. ఇలాగే ఏవియేషన్, బ్యాంకింగ్ వంటి ఇతర కీలక రంగాలు కూడా ఉన్నాయి. అందువల్లే ఈ నెల 20 నుంచి కొన్ని ముఖ్య రంగాలను ఆంక్షల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్