AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Drama : క్రికెట్ చరిత్రలో వింత రన్ అవుట్..బ్యాట్ విరిగింది..కొంప మునిగింది

Cricket Drama : సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు దురదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది. గతంలో వర్షం వల్లనో, డక్‌వర్త్ లూయిస్ లెక్కలు తప్పడం వల్లనో మ్యాచ్‌లు ఓడిపోవడం చూశాం. కానీ తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక విరిగిపోయిన బ్యాట్ సౌతాఫ్రికా కొంపముంచింది.

Cricket Drama : క్రికెట్ చరిత్రలో వింత రన్ అవుట్..బ్యాట్ విరిగింది..కొంప మునిగింది
Sa Vs Wi
Rakesh
|

Updated on: Feb 01, 2026 | 4:09 PM

Share

Cricket Drama : సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు దురదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది. గతంలో వర్షం వల్లనో, డక్‌వర్త్ లూయిస్ లెక్కలు తప్పడం వల్లనో మ్యాచ్‌లు ఓడిపోవడం చూశాం. కానీ తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక విరిగిపోయిన బ్యాట్ సౌతాఫ్రికా కొంపముంచింది. గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్ ముక్కలవ్వడం, ఆ కంగారులో బ్యాటర్ చేసిన చిన్న పొరపాటు సౌతాఫ్రికాను ఓటమి పాలు చేసింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ హై డ్రామా మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.

సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 6 ఓవర్లలోనే 114 పరుగులు చేయగా, డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 10 ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా గట్టిగానే పోరాడింది. చివరి ఓవర్‌లో సఫారీ జట్టు విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా, తొలి నాలుగు బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి రెండు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అక్కడే అసలు డ్రామా మొదలైంది. ఐదో బంతిని కార్బిన్ బాష్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని క్యాచ్ పట్టడంలో ఫీల్డర్ విఫలమయ్యాడు. అయితే బాష్ ఆడిన షాట్ ధాటికి అతని బ్యాట్ రెండు ముక్కలైపోయింది. హ్యాండిల్ బాష్ చేతిలో ఉంటే, బ్యాట్ బాడీ కింద పడిపోయింది. కంగారులో బాష్ హ్యాండిల్‌ను ఒక చేత్తో, విరిగిన బ్యాట్ ముక్కను మరో చేత్తో పట్టుకుని రన్ కోసం పరిగెత్తాడు. మొదటి రన్ పూర్తి చేసే క్రమంలో విరిగిన బ్యాట్ ముక్కను క్రీజులో ఆనించడానికి ప్రయత్నించాడు కానీ, అది సరిగ్గా క్రీజు లోపల పడలేదు. ఆ విషయం గమనించకుండానే రెండో రన్ కోసం వెళ్ళిపోయాడు.

అంపైర్లు దీనిని రివ్యూ చేయగా, బాష్ బ్యాట్ క్రీజు లోపల టచ్ అవ్వలేదని తేలింది. దీనిని షార్ట్ రన్‎గా ప్రకటించి సౌతాఫ్రికాకు కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చారు. ఫలితంగా చివరి బంతికి 8 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆ రన్ కౌంట్ అయ్యి ఉంటే, చివరి బంతికి 7 పరుగులు అవసరమయ్యేవి.. అప్పుడు బాష్ సిక్సర్ కొట్టి ఉంటే మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ కు వెళ్ళేది. కానీ విరిగిన బ్యాట్ తెచ్చిన కన్ఫ్యూజన్ వల్ల సౌతాఫ్రికా కేవలం 118 పరుగులే చేయగలిగింది. 6 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఇదొక వింతైన, అత్యంత దురదృష్టకరమైన ఓటమిగా మిగిలిపోతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us