బ్రేకింగ్: ఏపీలో అసెంబ్లీలో ఇద్దరికి, సచివాలయంలో 10 మందికి కరోనా..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. ఇక కరోనా నిర్థారణ పరీక్షలు కూడా ఏపీ సర్కార్ విస్తృతంగా నిర్వహిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాకూడా ఈ మహమ్మారి ఏదో రూపంలో..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. ఇక కరోనా నిర్థారణ పరీక్షలు కూడా ఏపీ సర్కార్ విస్తృతంగా నిర్వహిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ మహమ్మారి ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది. అందులోనూ ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, పోలీసులు, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. అలాగే ఏపీ సచివాలయంలోని 10 మంది ఉద్యోగులకి కూడా కరోనా సోకింది. దీంతో వాళ్లు పనిచేస్తోన్న బ్లాక్ మొత్తం శానిటైజ్ చేశారు అధికారులు. అలాగే వీరితో కాంటాక్ట్ ఉన్న ఉద్యోగులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. కాగా ఈ తాజాగా కరోనా కేసులతో ఏపీ అసెంబ్లీ, సచివాలయంలో 27కి చేరాయి కోవిడ్ కేసుల సంఖ్య.
కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 611 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 46 మందికి కరోనా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కి చేరింది.
Read More:
లాక్‌డౌన్ భయం.. సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..



