AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేట్లు ఫిక్స్.. ప్రైవేటు ఆస్పత్రిలో రూ.2,200కే కరోనా టెస్ట్

ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా టెస్టుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే కరోనా టెస్టుకు ధర కూడా నిర్ణయించింది. ఒక్కో కరోనా టెస్టుకు రూ.2,200గా నిర్ణయించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ప్రకారం కోవిడ్ టెస్టులు చేయాలని...

రేట్లు ఫిక్స్.. ప్రైవేటు ఆస్పత్రిలో రూ.2,200కే కరోనా టెస్ట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 15, 2020 | 1:41 PM

Share

ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా టెస్టుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే కరోనా టెస్టుకు ధర కూడా నిర్ణయించింది. ఒక్కో కరోనా టెస్టుకు రూ.2,200గా నిర్ణయించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ప్రకారం కోవిడ్ టెస్టులు చేయాలని మంత్రి ఈటెల రాజెందర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కరోనా టెస్టులు చేయాలి. కరోనా సోకపోతే హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ల చికిత్సకి ఎంత వసూలు చేయాలనే విషయాన్ని కూడా వెల్లడించారు మంత్రి.

కరోనా లక్షణాలు ఉండి పాజిటివ్ సోకితే.. రోజుకు రూ.4 వేలు వసూలు చేయాలన్నారు. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స పాందితే రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌ మీద చికిత్స చేస్తే రూ.9 వేల చొప్పున ఛార్జీలు వసూలు చేయాలన్నారు. వెంటిలేటర్, ఐసీయూలో ఉన్న సమయంలో యాంటీ వైరల్ డ్రగ్‌కు అదనపు ఛార్జీ వసూలు చేయవచ్చన్నారు. కరోనా పరీక్షలు చికిత్సను వ్యాపారం చేస్తే కటిన చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి సీజ్ చేస్తాం. ప్రభుత్వం చికిత్స చేయడానికి సిద్దంగా ఉంది. కావాలి అనుకున్న వారు ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా చేసుకోవచ్చన్నారు.

కంటైన్మెంట్ పదానికి అర్థం చెప్పింది తెలంగాణ రాష్ట్రం. లాక్ డౌన్ విజయవంతంగా అమలు చేయడం వల్ల తెలంగాణలో కామ్యూనిటీ స్ప్రెడ్ లేదు అని ఐసీఎంఆరే ప్రకటించిందన్నారు. శాస్త్రీయంగా, క్షేత్ర స్థాయి అనుభవాలతో పని చేస్తున్నాము. హైదరాబాద్ చుట్టూ కరోనా వ్యాప్తి తెలుసుకోవడానికి 30 నియోజకవర్గాల్లో పరీక్షలు చేస్తున్నాం. హైదరాబాద్‌‌లో ప్రతి ఇంటినీ సర్వే చేస్తాము. దీనికోసం అదనంగా సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని తెలిపారు మంత్రి ఈటెల.

Read More: 

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా