క‌రోనా ఉధృతిః ఏపీలో కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజు, రోజుకూ వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. వీరిలో..

క‌రోనా ఉధృతిః ఏపీలో కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు..
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2020 | 2:12 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజు, రోజుకూ వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. 47మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.