అక్కడ స్మార్ట్‌కార్డ్ ఉంటేనే మసీదులోకి అనుమతి..!

కొజికోడ్‌ కుట్టిచిరలోని ఓ మసీదులో రద్దీని నియంత్రించేందుకు మసీదు కమిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ కొత్త ప్రయోగాన్ని అమలు చేస్తోంది. మసీదులో ప్రార్థన చేసేందుకు వచ్చే వారికి స్మార్ట్‌కార్డులు జారీ.

అక్కడ స్మార్ట్‌కార్డ్ ఉంటేనే మసీదులోకి అనుమతి..!
Follow us

|

Updated on: Jun 15, 2020 | 1:38 PM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ సడలింపులతో ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా కేరళలోని మసీదు నిర్వహకులు వినూత్నంగా ఆలోచన చేశారు. కరోనా నేపపథ్యంలో కొజికోడ్‌ కుట్టిచిరలోని ఓ మసీదులో రద్దీని నియంత్రించేందుకు మసీదు కమిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ కొత్త ప్రయోగాన్ని అమలు చేస్తోంది. మసీదులో ప్రార్థన చేసేందుకు వచ్చే వారికి స్మార్ట్‌కార్డులు జారీ చేసి భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు చేపట్టింది. కుట్టిచిరలో చాలామంది ముస్లింలు ఇప్పటికే కార్డులు తీసుకున్నారు. మసీదు పరిసరాల్లోకి ప్రవేశించిన వారు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకొని కెమెరా ముందు నిల్చోని తమ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఆటోమెటిక్‌ సిస్టమ్‌ ద్వారా వారి వివరాలు, నివాసస్థలం, ఫొన్‌నెంబర్‌తో సహా నమోదు చేస్తుంది. స్మార్ట్‌కార్డు స్వైపింగ్‌ చేయగానే మసీదు డోరు సెన్సార్ల సాయంతో తెరుచుకుంటాయి. మసీదులో సామాజిక దూరం అమలు చేసేందుకు ఈ సరికొత్త విధానం రూపొందించామని మసీదు కమిటీ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రార్థనా మందిరంలోకి అందరికీ అనుమతినిస్తున్నామన్నారు.