Coronavirus: తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా కలకలం.. వైరస్ బారినపడ్డ పలువురు అధికారులు

తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని బీఆర్‌కే భవన్ లో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Coronavirus: తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా కలకలం.. వైరస్ బారినపడ్డ పలువురు అధికారులు
Brkr Bhavan
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 18, 2022 | 2:48 PM

Coronavirus in BRKR Bhavan: తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని బీఆర్‌కే భవన్(BRK Bhavan)లో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సాధారణ పరిపాలన, విద్యాశాఖలతో సహా పలు విభాగాల్లో 15 మందికి పైగా కరోనా వైరస్(Coronavirus) సోకింది. ఐఏఎస్ అధికారి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానీయకు కోవిడ్ పాజిటివ్(Covid19) నిర్థారణ అయ్యింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు పీఎస్ లతో సహా మరికొంత మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. వీరితో పాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ల కూడా కరోనా కలకలం రేపుతోంది. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలోనూ కరోనా కలవరం రేగింది. మంత్రి భార్య శచీదేవి కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేయించేకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే మిగతా ఎవ్వరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వైసీపీ నేత.. డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మన కృష్ణదాస్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు లక్షణాలు పెద్దగా ఏవీ లేవని అయినప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్టు తెలిపారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అంతకు ముందే సంక్రాంతి సందర్భంగా క్యాంపు కార్యాలయానికి కూడా సెలవు ప్రకటించామని తెలిపారు. ఇదిలావుంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకుతుండటం ఆందోళక కలిగిస్తోంది.

అయితే, ఎవరు ఆందోళన చెందాల్సి అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని సూచిస్తున్నారు.

Read Also…. Covid-19: పొంచిఉన్న వేరియంట్ల ప్రమాదం.. వీలైనంత త్వరగా చిన్నారులకు టీకాలివ్వాలి..