తమిళనాడులో 2 లక్షలకు చేరువలో కేసులు..
తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో..

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,785 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,749కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,132 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక శుక్రవారం నాడు కరోనా నుంచి కోలుకుని 6,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,43,297కి చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు.
Tamil Nadu reports 6,785 new #COVID19 cases taking total number of cases to 1,99,749. There are 53,132 active cases in State. 6,504 patients discharged today, total discharged cases stand at 1,43,297. 88 more people lost lives; death toll at 3320: State National Health Mission
— ANI (@ANI) July 24, 2020



