AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు.. ఆ జిల్లాలోనే అత్యధికం..

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 80 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 48,114 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 8,147 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు.. ఆ జిల్లాలోనే అత్యధికం..
Ravi Kiran
|

Updated on: Jul 24, 2020 | 6:24 PM

Share

Coronavirus Positive Cases Andhra Pradesh: ఏపీలో కరోనా కేసుల సంఖ్య 80 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 48,114 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 8,147 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,858కు చేరింది. వీటిల్లో 39,990 యాక్టివ్ కేసులు ఉండగా.. 39,935 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 49 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 933కు చేరింది.

అటు నిన్న ఒక్క రోజే 2,380 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూసుకుంటే.. అనంతపురం 984, చిత్తూరు 630, తూర్పుగోదావరి 1029, గుంటూరు 703, కడప 494, కృష్ణ 359, కర్నూలు 914, నెల్లూరు 278, ప్రకాశం 355, శ్రీకాకుళం 374, విశాఖపట్నం 898, విజయనగరం 322, పశ్చిమ గోదావరి 807 కేసులు నమోదయ్యాయి. అలాగే తూర్పుగోదావరి(11067), కర్నూలు(9615), గుంటూరు(8800), అనంతపురం(8266) జిల్లాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు(150), కృష్ణ(133), తూర్పుగోదావరి(107), గుంటూరు(88), అనంతపురం(81) జిల్లాల్లో ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయి.

Follow Us