తమిళనాట పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా అప్డేట్స్‌ ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు లక్షల మార్క్ దాటేసింది. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా ఆరు వేల సంఖ్య దాటింది.

తమిళనాట పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా అప్డేట్స్‌ ఇవే..
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 10:25 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు లక్షల మార్క్ దాటేసింది. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా ఆరు వేల సంఖ్య దాటింది. ముఖ్యంగా మహారాష్ట్ర,  తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తమిళనాడులో శుక్రవారం నాడు 1,438 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 28,694కి చేరింది. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 12 మంది మరణించారని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 232 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12,687 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 15,762 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.