కరోనా అనుమానమే పెను భూతమై.. చివరకు ఇలా..

కరోనా అనుమానం.. అతని పాలిట శాపమై ప్రాణాలు తీసింది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చేసేందుకు కుట్రపన్నాడంటూ ఓ 22 ఏళ్ల వ్యక్తిపై స్థానికులు దాడికి పాల్పడి.. హత్య చేశారు. మృతుడు బవానా నగరం సమీపంలోని హరేవాలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతనెల నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి వెళ్ళాడమే కాకుండా.. ఆ తర్వాత విషయం చెప్పకుండా కూరగాయలతో నిండిన ట్రక్కుతో వ్యాపారానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అజాద్బూర్‌ సబ్జీ మండి […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:39 pm, Thu, 9 April 20
కరోనా అనుమానమే పెను భూతమై.. చివరకు ఇలా..

కరోనా అనుమానం.. అతని పాలిట శాపమై ప్రాణాలు తీసింది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చేసేందుకు కుట్రపన్నాడంటూ ఓ 22 ఏళ్ల వ్యక్తిపై స్థానికులు దాడికి పాల్పడి.. హత్య చేశారు. మృతుడు బవానా నగరం సమీపంలోని హరేవాలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతనెల నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి వెళ్ళాడమే కాకుండా.. ఆ తర్వాత విషయం చెప్పకుండా కూరగాయలతో నిండిన ట్రక్కుతో వ్యాపారానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అజాద్బూర్‌ సబ్జీ మండి దగ్గర స్థానిక జనం పట్టుకున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం వదిలేశారు. ఆ తర్వాత ఆ వక్తి తన సొంత గ్రామానికి చేరుకున్న సమయంలో.. అక్కడి స్థానికులు అతడిపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించంగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.