ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకీ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీలో 40 వేలు దాటిపోయాయి కోవిడ్ కేసుల సంఖ్య. ఈ కరోనాతో రాజకీయ నాయకులు సైతం హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఇప్పుడు మరో ఏపీ ఎమ్మెల్యే కూడా...

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకీ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీలో 40 వేలు దాటిపోయాయి కోవిడ్ కేసుల సంఖ్య. ఈ కరోనాతో రాజకీయ నాయకులు సైతం హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఇప్పుడు మరో ఏపీ ఎమ్మెల్యే కూడా కోవిడ్ సోకింది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడంతో.. కుటుంబ సభ్యులతోపాటుగా ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.
ఇక గడిచిన 24 గంటల్లో శుక్రవారం కొత్తగా 2,602 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 2,592 కాగా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. వీటిల్లో 19,814 యాక్టివ్ కేసులు ఉండగా.. 20,298 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 42 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 534కు చేరింది.

Read More:
కరోనా టెర్రర్: అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రాలివే.. తెలంగాణ కూడా!
కృష్ణా జిల్లాకు ‘ఎన్టీఆర్’ పేరు? ఏపీ మంత్రి ఏం చెప్పారంటే!
బ్రేకింగ్: ‘తెలంగాణ సచివాలయం’ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్



