విమాన ప్రయాణికులకు ఇండిగో ఆఫర్‌..రెండు సీట్లు..!

కరోనా నేపథ్యంలో దాదాపు గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన విమాన సర్వీసులు ఇప్పుడిప్పుడే మళ్లీ గాల్లోకి ఎగురుతున్నాయి. అయితే, కరోనా భయంతో ప్రయాణం అంటేనే భయపడుతున్న వారి కోసం ఇండిగో సంస్థ కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది.

  • Jyothi Gadda
  • Publish Date - 7:18 pm, Fri, 17 July 20
విమాన ప్రయాణికులకు ఇండిగో ఆఫర్‌..రెండు సీట్లు..!

కరోనా నేపథ్యంలో దాదాపు గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన విమాన సర్వీసులు ఇప్పుడిప్పుడే మళ్లీ గాల్లోకి ఎగురుతున్నాయి. గురువారం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభం కానున్నాయని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా భయంతో ప్రయాణం అంటేనే భయపడుతున్న వారి కోసం ఇండిగో సంస్థ కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల ప్రజలు మాస్క్‌ ధరించటం, భౌతిక దూరం పాటిస్తున్నాయి. అయితే, విమాన ప్రయాణంలోనూ భౌతికదూరం కోసం ప్రయాణికులు కావాలంటే 2 సీట్లు బుక్‌ చేసుకునేలా ఇండిగో ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. “6ఈ డబుల్‌ సీట్‌’ స్కీంను ఈ నెల 24న ప్రారంభించనుంది. అదనపు సీటు బుక్‌ చేసుకునే వారు వాస్తవ టికెట్‌ ధర కంటే 25శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో తెలిపింది. ప్రయాణికుడు బుక్‌ చేసుకున్న సీటు పక్కనే రెండోది కూడా ఉంటుందని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.