ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. పైలట్లకు జీతం కట్..
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా సంస్థ తన పైలట్లు, సిబ్బందిని వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా సంస్థ తన పైలట్లు, సిబ్బందిని వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. కాగా.. ఇప్పటివరకు 55 మంది ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది.
ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) రాజీవ్ భన్సాల్ కు అప్పగిస్తూ, ఎయిర్ ఇండియా బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. పైలట్లకు స్థూల జీతభత్యాలపై దాదాపు 60% జీతాల కోత విధించింది. ఉన్నతాధికారులకు మాత్రం కేవలం జీతంపై 3.5% తగ్గింపును ప్రతిపాదించింది. ఈ కోతలపై పైలట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..
Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..



