యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

దేశంలో కోవిద్-19 విజృంభణతో జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు, ఇతర అంశాల దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని

యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 12:25 PM

దేశంలో కోవిద్-19 విజృంభణతో జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు, ఇతర అంశాల దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, కేంద్ర మానవ వనరులశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం ఆయా వర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఉన్నత విద్యాకోర్సులైన యూజీ, పీజీ ఫైనలియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌లోగా పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు చర్యలు చేపడుతున్నాయి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌లోగా పరీక్షలు నిర్వహించేలా వర్సిటీలకు సూచిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందు వల్ల చివరి సంవత్సరం కాకుండా మిగతా విద్యార్థులను పై తరగతుల్లోకి ప్రమోట్‌ చేసి పరీక్షలు నవంబర్‌లో జరుపుతారాని తెలుస్తోంది. ఏపీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్‌ వర్సిటీలు 54 ఉండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 30 ఉన్నాయి. వీటి పరిధిలో 3,285 కాలేజీలు యూజీ, పీజీ సహా వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయి. నేడు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వీసీలు, ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..