కృష్ణా జిల్లాకు ‘ఎన్టీఆర్’ పేరు? ఏపీ మంత్రి ఏం చెప్పారంటే!

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌‌లో కొత్త జిల్లాల అంశం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను కొత్తగా 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది జగన్ సర్కార్. ఈ మేరకు అధ్యయన కమిటీకి కూడా ఆమెదం తెలిపింది. ఈ క్రమంలోనే దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌...

కృష్ణా జిల్లాకు 'ఎన్టీఆర్' పేరు? ఏపీ మంత్రి ఏం చెప్పారంటే!
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 4:43 PM

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌‌లో కొత్త జిల్లాల అంశం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను కొత్తగా 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది జగన్ సర్కార్. ఈ మేరకు అధ్యయన కమిటీకి కూడా ఆమెదం తెలిపింది. ఈ క్రమంలోనే దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ పేరు చర్చనీయాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని.. పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు సీఎం జగన్.

అయితే ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల అధ్యయానికి కమిటీ వేయడంతో.. కృష్ణా జిల్లాకు ‘ఎన్టీఆర్ పేరు’ పెడతానని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? లేదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే జగన్ ఖచ్చితంగా ఇచ్చిన మాటపై నిలబడతారంటూ ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కానీ బెజవాడకు ఎన్టీఆర్ పేరు పెడతారా? లేక మచిలీపట్నంకు పెడతారా? అన్నది తేలాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి వెల్లంపల్లి.

అలాగే విజయవాడ ఫ్లైఓవర్‌ను వంద శాతం ఆగష్టు నెలలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు ఆలస్యమయ్యాయని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనుల్లో వేగంపెంచామని  ఏపీ మంత్రి వివరించారు.

Read More: 

బ్రేకింగ్: ‘తెలంగాణ సచివాలయం’ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మాస్క్ విషయంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..

ఛార్మీ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరోయిన్..