మాస్క్ విషయంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు..

మాస్క్ విషయంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 2:47 PM

ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని రకాలుగా నివారణా మార్గాలు తీసుకుంటున్నా.. ఏదో ఒక రూపంలో ఎటాక్ చేస్తుంది ఈ మహమ్మారి. ఈ  నేపథ్యంలో  కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మాస్క్ తప్పనిసరి చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, పని చేసే స్థలాల్లో, ప్రయాణ సమయాల్లో మాస్క్‌ను ఖచ్చితంగా ధరించాలని సర్కార్ ఆదేశించింది.

అలాగే ఈ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు కూడా విధిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకూ ఏపీలో ఇంత ఖచ్చితమైన నిబంధనలు లేకపోయినప్పటికీ.. ఇకపై తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కూడా మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.

Read More: 

ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని మండే సూర్యుడి అద్భుత చిత్రాలు..

ఛార్మీ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరోయిన్..