Gannavaram: అయ్య బాబోయ్.. సీజ్ చేసిన లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా ఊహించని ట్విస్ట్..

కృష్ణా జిల్లా పోలీసులు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో మొత్తం 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అయితే జిల్లా ఎస్పీ , ఆర్వో జేసీ గీతాంజలిశర్మ రోడ్‌ రోలర్‌కు జెండా ఊపిన తర్వాత బాటిళ్లను తొక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా .....

Gannavaram: అయ్య బాబోయ్.. సీజ్ చేసిన లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా ఊహించని ట్విస్ట్..
Liquor Bottles
Follow us

|

Updated on: May 02, 2024 | 6:53 PM

అటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు.. ఇటు ఆంధ్రాలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు. హడావిడి మాములుగా తేదు. నేతల ప్రచార హోరు ఓ రేంజ్‌లో ఉంది. ఓటర్ దేవుళ్లను ఆకట్టుకునేందుకు.. ఎవరికీ వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాయిలాలు పంచేందుకు కొందరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో భారీగ క్యాష్, గోల్డ్, సిల్వర్, లిక్కర్ బాటిల్స్, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల స్టోర్ చేసిన మద్యం డంప్‌ల గుట్టు రట్టు చేశారు.. పోలీసులు, ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్. తాజాగా గన్నవరం నియోజకవర్గంలో పట్టబడ్డ లిక్కర్ బాటిల్స్ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మద్యం బాటిళ్లను పోలీసులు.. రోడ్డు రోలర్ కింద వేసి ధ్వంసం చేశారు.

కృష్ణా జిల్లా పోలీసులు చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేపై పొట్టిపాడు టోల్‌ప్లాజా దగ్గర రోడ్‌ రోలర్‌తో లిక్కర్ బాటిల్స్‌ను తొక్కించారు.. మొత్తం 58,032 క్వార్టర్ల గోవా మద్యం బాటిల్స్ ధ్వంసం చేశారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు..  రోడ్‌ రోలర్‌కు జెండా ఊపిన తర్వాత బాటిల్స్ తొక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందరూ కంగుతిన్నారు. పోలీసులు, జనాలు, మీడియా ప్రతినిధులు చెల్లాచెదురు అయ్యారు. ఆ వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్..  మంటలు అదుపులోకి చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎండల తీవ్రతకు ఫైర్ చెలరేగినట్లు భావిస్తున్నారు. ఇటీవల ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మద్యం బాటిళ్ల వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై త్వరలోనే కోర్టుకు ఆధారాలు సమర్పిస్తామన్నారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని.. మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..