AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే

2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా  గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. మూడు నాలుగు బ్యాంక్ ల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది.

Jr NTR: హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
Ntr
Rajeev Rayala
|

Updated on: May 17, 2024 | 8:48 AM

Share

ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా  గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. మూడు నాలుగు బ్యాంక్ ల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీత లక్ష్మి.

కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందట ఆ కిలాడి గీత లక్ష్మీ. చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ప్లాట్ ఒనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది.

ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. అయితే  DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..