AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నవాళ్లు పక్కా తినాల్సిన ఆకు పచ్చడి ఇదే

కార్తీకమాసంలో చాలామంది ఉల్లి, వెల్లుల్లిని ఆహారంలో వాడటం మానేస్తారు. అలాంటి వారికి, రుచిని ఏ మాత్రం తగ్గించకుండా, ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ పచ్చడి ఒక మంచి టేస్ట్ ను ఇస్తుంది. అన్నం, ఇడ్లీ, దోశ లేదా రాగి ముద్ద వంటి ఏ ఆహారంతోనైనా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Nov 14, 2026 | 3:10 PM

Share

1 / 5
కావల్సిన పదార్దాలు:  నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి: 7-8 , జీలకర్ర: అర టీ స్పూన్,  ధనియాలు: 1 టేబుల్ స్పూన్, 
నువ్వులు: 3 టేబుల్ స్పూన్లు ,  పచ్చిమిర్చి: 5-6 (కట్ చేసినవి),  పుదీనా: 2-3 కప్పులు (శుభ్రంగా కడిగినవి),  టమాటాలు: 3 పెద్ద సైజు (కట్ చేసినవి),   ఉప్పు: రుచికి సరిపడా, చింతపండు,  బెల్లం: కొద్దిగా ,  నీరు: అవసరమైనంత తీసుకోవాలి.

కావల్సిన పదార్దాలు: నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి: 7-8 , జీలకర్ర: అర టీ స్పూన్, ధనియాలు: 1 టేబుల్ స్పూన్, నువ్వులు: 3 టేబుల్ స్పూన్లు , పచ్చిమిర్చి: 5-6 (కట్ చేసినవి), పుదీనా: 2-3 కప్పులు (శుభ్రంగా కడిగినవి), టమాటాలు: 3 పెద్ద సైజు (కట్ చేసినవి), ఉప్పు: రుచికి సరిపడా, చింతపండు, బెల్లం: కొద్దిగా , నీరు: అవసరమైనంత తీసుకోవాలి.

2 / 5
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత, కట్ చేసిన 7-8 ఎండు మిర్చి ముక్కలు వేయాలి. తరువాత అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత, మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కలుపుకోవాలి. నువ్వులు వాడని వారు ఈ దశలో పల్లీలు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కమ్మటి వాసన వచ్చేవరకు లో ఫ్లేమ్‌లో వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి ముక్కలు, శుభ్రంగా కడిగిన రెండు మూడు కప్పుల పుదీనా ఆకులు వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ పచ్చడిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. అయితే కారం తక్కువ తినే వారు ఈ రెండింటి పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు.

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత, కట్ చేసిన 7-8 ఎండు మిర్చి ముక్కలు వేయాలి. తరువాత అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత, మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కలుపుకోవాలి. నువ్వులు వాడని వారు ఈ దశలో పల్లీలు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కమ్మటి వాసన వచ్చేవరకు లో ఫ్లేమ్‌లో వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి ముక్కలు, శుభ్రంగా కడిగిన రెండు మూడు కప్పుల పుదీనా ఆకులు వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ పచ్చడిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. అయితే కారం తక్కువ తినే వారు ఈ రెండింటి పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు.

3 / 5
పుదీనా కొంచెం మగ్గిన తర్వాత, మూడు పెద్ద సైజు టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఉసిరికాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి. రుచిని సమతుల్యం చేయడానికి కొద్దిగా బెల్లం కూడా కలుపుకోవాలి. పుదీనా పచ్చడిలో బెల్లం వేయడం వల్ల రుచి ఎంతో మెరుగుపడుతుంది. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి.

4 / 5

 కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటాల నుండి నీరు ఊరుతుంది. పచ్చడి మరీ గట్టిగా ఉండకూడదనుకుంటే, కొద్దిగా నీరు చేర్చి మళ్ళీ మూత పెట్టి మరికొంత సేపు ఉడికించుకోవాలి. మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపి, పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా చల్లారిన వేయించిన నువ్వుల మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి తినే వారు ఈ దశలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. పొడి చేసుకున్న తర్వాత, పూర్తిగా చల్లారిన పుదీనా-టమాటా మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. టమాటాలు ఉడికినప్పుడు వచ్చిన నీటిని పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే కలుపుకోవాలి. పచ్చడిని మరీ పేస్ట్‌లా గ్రైండ్ చేయకుండా, కొద్దికొద్దిగా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి రోట్లో రుబ్బినట్లుగా ఎంతో రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో