AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: మమ్మల్ని బలిపశువులను చేశారు.. సొంత క్రికెట్ బోర్డు పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు

David Warner: 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్‌లో చర్చకు వచ్చింది. అప్పటి విచారణలో జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్‌లను ప్రశ్నించలేదని డేవిడ్ వార్నర్ ఆరోపించాడు. ఉస్మాన్ ఖవాజాకు మద్దతుగా నిలిచిన వార్నర్, ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలపైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

David Warner: మమ్మల్ని బలిపశువులను చేశారు.. సొంత క్రికెట్ బోర్డు పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు
David Warner
Rakesh
|

Updated on: Nov 14, 2026 | 3:25 PM

Share

David Warner: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నేరుగా క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ తీరుపై ప్రశ్నలు సంధించాడు. అప్పట్లో బంతి ఆకారం మార్చేందుకు సాండ్‌పేపర్ ఉపయోగించిన ఘటనపై జరిగిన విచారణలో కీలక బౌలర్లను ప్రశ్నించలేదని ఆరోపించాడు. ఉస్మాన్ ఖవాజా ఆత్మకథలో చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన వార్నర్.. అప్పటి విచారణలో లోపాలు ఉన్నాయని చెబుతున్నాడు.

స్టార్ బౌలర్లను విచారించలేదా?

నవంబర్ 14న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించిన వార్నర్.. 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన విచారణలో జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్‌లను ఇంటర్వ్యూ చేయలేదని తనకు తెలిసిన సమాచారం అని పేర్కొన్నాడు. ఒకవేళ ఇది నిజమైతే.. బౌలర్లకు ఈ వ్యవహారం గురించి ఏమీ తెలియదని క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా చెప్పగలుగుతోందని ప్రశ్నించాడు. అయితే ఈ ముగ్గురు ఆటగాళ్లను విచారించలేదన్నది వార్నర్ చేసిన ఆరోపణ మాత్రమే. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ముందే దోషులను నిర్ణయించారా?

ఈ వ్యవహారంపై వార్నర్ మరింత ఘాటుగా స్పందించాడు. విచారణ మొదలుకాకముందే ఎవరిని బాధ్యులుగా చూపించాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారని ఆరోపించాడు. తమకు అనుకూలంగా ఉండేలా హడావుడిగా, సరిగా లేని విచారణ జరిపారని విమర్శించాడు. బౌలర్లకు ఈ విషయం తెలియదనే వాదనను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో దాచిపెట్టే ప్రయత్నం కనిపిస్తోందని తన పోస్టులో పేర్కొన్నాడు. అయితే ఇవన్నీ వార్నర్ చేసిన ఆరోపణలే తప్ప, నిరూపితమైన విషయాలు కావు.

ఖవాజా వ్యాఖ్యలతో మొదలైన వివాదం

ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ సబ్ర్‎లో 2018 బాల్ ట్యాంపరింగ్ ఘటన గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. ఆ సమయంలో జట్టులోని మరికొందరికి కూడా ఈ వ్యవహారం గురించి తెలుసని అతడి వ్యాఖ్యల సారాంశం. ఈ వాదనలను ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీవ్రంగా ఖండించాడు. సాండ్‌పేపర్‌ను మైదానంలోకి తీసుకెళ్లి బంతిని మార్చే విషయం తనకు ముందుగా తెలియదని స్పష్టం చేశాడు. జట్టంతా ఈ కుట్రలో భాగమన్న వాదన పూర్తిగా తప్పని అన్నాడు. ఖవాజా తన పుస్తకంలో చేసిన ఆరోపణలు ఇతరుల పేరుప్రతిష్ఠలకు నష్టం కలిగించేలా ఉన్నాయని కూడా వ్యాఖ్యానించాడు.

కమిన్స్‌పై కూడా వార్నర్ అసంతృప్తి

కమిన్స్ వ్యాఖ్యలపై కూడా వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఖవాజాను కమిన్స్ బహిరంగంగా విమర్శించడం తనకు నచ్చలేదని గతంలోనే చెప్పాడు. ఖవాజాను మధ్యలో వదిలేసినట్లుగా అనిపించిందని వ్యాఖ్యానించాడు. వార్నర్, ఖవాజా ఇద్దరూ గతంలో ఆస్ట్రేలియా జట్టుకు కలిసి ఆడారు. ఈ నేపథ్యంలో పాత సహచరుడికి వార్నర్ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. మరోవైపు కమిన్స్ మాత్రం తనకు తెలిసిన విషయాలనే చెబుతున్నానని, ఖవాజా చేసిన ఆరోపణలు సరైనవి కావని అంటున్నాడు.

2018లో ఏం జరిగింది?  

2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బంతి పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. ఆ సమయంలో స్మిత్ కెప్టెన్‌గా, వార్నర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. ఇప్పుడు ఖవాజా పుస్తకంలోని వ్యాఖ్యలు, కమిన్స్ వివరణ, వార్నర్ తాజా ఆరోపణలతో ఎనిమిదేళ్ల క్రితం నాటి వివాదం మళ్లీ చర్చలోకి వచ్చింది. అయితే ఈ విచారణను తిరిగి ప్రారంభించేందుకు బలమైన కారణం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ ఇప్పటికే పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సొంత క్రికెట్ బోర్డు పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు
సొంత క్రికెట్ బోర్డు పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు
ఆ ఆలయానికి వెళ్లాలంటే భయమే.. భక్తులను హెడలెత్తిస్తున్న కోతులు..
ఆ ఆలయానికి వెళ్లాలంటే భయమే.. భక్తులను హెడలెత్తిస్తున్న కోతులు..
శని ఎఫెక్ట్... డిసెంబర్ 11 నుంచి వీరి తలరాత మారడం ఖాయం
శని ఎఫెక్ట్... డిసెంబర్ 11 నుంచి వీరి తలరాత మారడం ఖాయం
మసాలా ఘాటు లేకుండా బోటీ ఫ్రై.. ఇలా చేస్తే అదిరిపోద్దీ
మసాలా ఘాటు లేకుండా బోటీ ఫ్రై.. ఇలా చేస్తే అదిరిపోద్దీ
SBI క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? డిసెంబర్ నుంచి కొత్త రూల్స్
SBI క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? డిసెంబర్ నుంచి కొత్త రూల్స్
కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నవాళ్లు పక్కా తినాల్సిన ఆకు పచ్చడి ఇదే
కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నవాళ్లు పక్కా తినాల్సిన ఆకు పచ్చడి ఇదే
ఆవకాయను తలదన్నే క్యాలిఫ్లవర్ పచ్చడి.. వేడి వేడి అన్నంలో కలిపి
ఆవకాయను తలదన్నే క్యాలిఫ్లవర్ పచ్చడి.. వేడి వేడి అన్నంలో కలిపి
ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నా త్రివిక్రమ్.?
ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నా త్రివిక్రమ్.?
టీమిండియాలో కీలక మార్పు.. కుల్దీప్ ఔట్.. ఆ యంగ్ పేసర్‌కు ఛాన్స్
టీమిండియాలో కీలక మార్పు.. కుల్దీప్ ఔట్.. ఆ యంగ్ పేసర్‌కు ఛాన్స్
 ఆరోగ్య చిట్కాలే.. కానీ ఆఫీసులో ఇబ్బందులు తప్పవు!
 ఆరోగ్య చిట్కాలే.. కానీ ఆఫీసులో ఇబ్బందులు తప్పవు!
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో